Monday, September 1, 2014

భారత్-జపాన్‌ల మధ్య సహకారం విస్తరిస్తోంది

పట్టణాల అభివృద్ధి, పరిశోధన, ఆరోగ్యం వంటి పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందాలు కుదిరాయి. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి..

ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల జపాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. జపాన్ సాంస్కృతిక నగరం క్యోటో, భారత ఆధ్యాత్మిక పట్టణం వారణాసిల మధ్య కుదిరిన ఒప్పందం పరిధి మరింత విస్తరించనుంది. క్యోటో నగరం వారణాసితో పాటు భారత విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలతో కలసి పనిచేయనుంది. మేరకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ప్రధాని మోడీ వెల్లడించారు.
క్యోటో జపాన్ లోని అత్యంత పురాతన నగరం. ఇది దేశ సాంస్కృతిక రాజధాని. ఇక్కడ దాదాపు రెండు వేల దేవాలయాలు, పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఆధునిక నగరంగా క్యోటోను తీర్చిదిద్దుతూనే నగర సాంస్కృతిక వారసత్వాన్ని, సంపదను చెక్కు చెదరకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకోసం దేశం అనుసరించిన పద్ధతులను భారత్ వారణాసి కోసం ఉపయోగించుకోనుంది. క్యోటో పద్ధతుల్లోనే భారత ఆధ్యాత్మిక నగరం కాశీని కూడా అభివృద్ధి చేయనున్నారు. క్యోటో మేయర్ప్రధాని మోడీకి ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ప్రజెంటేషన్ఇచ్చారు.
క్యోటోను అభివృద్ధి పర్చడంలో, పరిశుద్ధ నగరంగా తీర్చి దిద్దడంలో పౌరులే ముందు వరసలో ఉన్నారు. నగరాన్ని పరిశుభ్రం చేయడంలో విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. స్టూడెంట్స్ నగరంలోని చెత్తను దాదాపు 40 శాతానిక తగ్గించ గలిగారని మోడీకి మేయర్ వివరించారు. సంవత్సరాల పాటు శ్రమించి నగరాన్ని సుందర వనంగా తీర్చిదిద్దుకున్నారు.

భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కు కొత్త హంగులు

హైదరాబాద్ రూపు రేఖలు మారనున్నాయా? బల్దియా ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్.. గ్రేటర్  అభివృద్దిపై దృష్టి సారించారు. అందుకు కొత్త డిజైన్లు.. సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రేటర్ అధికారగణం సింగపూర్ను తలపించేలా.. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్మరింత పెరిగేలా.. టౌన్ ప్లానింగ్కు లిస్ట్ అవుట్ చేసే పనిలో పడ్డారు

హైదరాబాద్మహానగరంలో పట్టి పీడిస్తున్న  ప్రధాన సమస్య అస్తవ్యస్థంగా.. అధ్వాన్నంగా ఉన్న రహదారులు. ప్రణాళికా బద్దంగా లేని వర్షపునీటి  పారుదల వ్యవస్థ. డ్రైనేజీ సమస్య.
మరోవైపు నగరంలో ఉన్న నాలాలు సైతం  కబ్జాదారుల చేతుల్లో  చిక్కుకుని  బక్కిచిక్కిపోయాయిచిన్న వర్షం కురిసినా.. కాలనీలు, గల్లీలుఅనే తేడా లేకుండా  జలమయం అవుతాయిరోడ్లన్నీ కుంటలను తలపిస్తాయి. దీంతో వర్షం వచ్చిందంటే చాలు నగరవాసుల తంటాలు అన్నీ ఇన్నీ కావు.
దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం..  గ్రేటర్ హైదరాబాద్నగరం సమగ్రాభివృద్ధికి, భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్చుట్టూ సుమారు 10 వేల కోట్ల వ్యయంతో.. దాదాపు 1500 కిలోమీటర్ల రోడ్లను పునర్వ్యవస్థీకరిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో GHMC అధికారలు.. ఇప్పటికే  సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకానికి ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో 150 కోట్ల నిధులతో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రోడ్రిపేరు సిస్టమ్ వాహనంతో 23 కిలో మీటర్ల రోడ్లను అభివృద్ధి చేసే ప్రక్రియను మొదలు పెట్టారు.